జిమెక్స్ 2020 ప్రారంభం…. అరేబియా సముద్రంలో భారత్-జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు | jimex 2020 between india and japan commence off in North Arabian Sea

National

oi-Srinivas Mittapalli

|

భారత్, జపాన్ దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు (జిమెక్స్-2020) శనివారం(సెప్టెంబర్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. జిమెక్స్ 4వ ఎడిషన్‌లో భాగంగా సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తర అరేబియా సముద్రంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత నావికాదళం, జపనీస్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్) మధ్య ద్వైవార్షికంగా జరిగే జిమెక్స్(JIMEX) కార్యక్రమం పరస్పర యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు దోహదపడనుంది.

జిమెక్స్ కార్యక్రమంతో భారత్-జపాన్ మధ్య నేవీ కోఆపరేషన్ బలపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు ఇరు దేశాల ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇందులో చర్చిస్తూ వస్తున్నారు. వెపన్ ఫైరింగ్,క్రాస్ డెక్ హెలికాప్టర్ ఆపరేషన్స్,యాంటీ సబ్ మెరైన్,ఎయిర్ వార్‌ఫేర్ డ్రిల్స్ తదితర అంశాల్లో జిమెక్స్ ద్వారా ఇరు దేశాలు పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటున్నాయి.

తాజా జిమెక్స్-2020లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆపరేషన్స్‌కు ప్రణాళిక రూపొందించారు. ఈసారి కరోనా నేపథ్యంలో నాన్-కాంటాక్ట్-ఎట్-సీ-ఓన్లీ ఫార్మాట్‌ విధానంలో మాత్రమే విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ చెన్నై,ఐఎన్ఎస్ టెగ్,ఐఎన్ఎస్ దీపక్ నౌకలు పాల్గొననున్నాయి.

 jimex 2020 between india and japan commence off in North Arabian Sea

జపాన్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ తరుపున కగా,ఇజుమో,ఇకజుచి నౌకలు పాల్గొనున్నాయి. చివరిసారిగా 2018లో నిర్వహించిన జిమెక్స్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. ఐఎన్‌ఎస్ సాత్పుర, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ కద్మత్ ఇందులో పాల్గొన్నాయి. వీటితోపాటు ఒక జలాంతర్గామి, లాంగ్ రేంజ్ మెరీటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, పలు హెలికాప్టర్లు పాల్గొన్నాయి.Source link

Related Articles

Sharad Pawar-Supriya Sule: सुप्रिया सुळे महाराष्ट्राच्या पहिल्या महिला मुख्यमंत्री होणार? शरद पवार म्हणाले… – will supriya sule be cm of maharashtra? ncp leader sharad...

मुंबई: महाराष्ट्राच्या पहिल्या महिला मुख्यमंत्री म्हणून आपण सुप्रिया सुळे यांच्याकडं पाहता का, या प्रश्नाचं उत्तर राष्ट्रवादी काँग्रेसचे अध्यक्ष शरद पवार यांनी अखेर दिलं...

Shiv Sena says- Yogi is cussed however nobody’s father has the braveness to take Movie Town from right here | શિવસેનાએ કહ્યું- યોગી હઠ...

Gujarati NewsNationalShiv Sena Says Yogi Is Stubborn But No One's Father Has The Courage To Take Film City From HereAdsથી પરેશાન છો? Ads...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,468FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Sharad Pawar-Supriya Sule: सुप्रिया सुळे महाराष्ट्राच्या पहिल्या महिला मुख्यमंत्री होणार? शरद पवार म्हणाले… – will supriya sule be cm of maharashtra? ncp leader sharad...

मुंबई: महाराष्ट्राच्या पहिल्या महिला मुख्यमंत्री म्हणून आपण सुप्रिया सुळे यांच्याकडं पाहता का, या प्रश्नाचं उत्तर राष्ट्रवादी काँग्रेसचे अध्यक्ष शरद पवार यांनी अखेर दिलं...

Shiv Sena says- Yogi is cussed however nobody’s father has the braveness to take Movie Town from right here | શિવસેનાએ કહ્યું- યોગી હઠ...

Gujarati NewsNationalShiv Sena Says Yogi Is Stubborn But No One's Father Has The Courage To Take Film City From HereAdsથી પરેશાન છો? Ads...

Rajnikanth All Set To Come In Politics Release Political Celebration In January Announcement To Be Made In 31 December – रजनीकांत की राजनीति में...

न्यूज डेस्क, अमर उजाला, चेन्नई Updated Thu, 03 Dec 2020 12:59 PM IST पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299...

Prior to leaving White Space, Donald Trump desires to do one thing for his kids | विदाई से पूर्व अपने बच्चों की रक्षा के...

वॉशिंगटन: अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप (Donald Trump) अपनी विदाई से पूर्व कुछ ऐसा करके जाना चाहते हैं कि उनके बच्चों और करीबियों को...