M. Venkaiah Naidu: Balu Health Update: బాలు కోలుకోవాలి అంటూ ప్రార్థనలు.. ఉప రాష్ట్రపతి ఫోన్.. రంగంలోకి 10 మంది నిపుణులు – venkaiah naidu enquired about s. p. balasubrahmanyam health condition


లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయడంతో యావత్ సినీ లోకం ఉలిక్కిపడింది. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి దిగజారిందని సమాచారం అందడంతో కోట్లాది మంది ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బాలు ఆరోగ్య పరిస్థితిపై అనుక్షణం టెన్షన్ టెన్షన్ నెలకొంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది.

50 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక రేపో మాపో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేస్తారని అభిమానులంతా ఆశిస్తున్న సమయంలో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. ”ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఎక్మోపైనే ఉన్నారు. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా విషమించింది. అత్యంత గరిష్ఠ స్థాయిలో లైఫ్‌ సపోర్ట్‌ అవసరమవుతోంది. ఆయన పరిస్థితిని నిపుణులైన వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు” అని ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం ప్రకటించారు.

Also Read: దీపికపై బీజేపీ కక్షగట్టిందా.. డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకేనా?

దీంతో ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. నిన్న రాత్రి ఆస్పత్రికి వచ్చిన కమల్ హాసన్.. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని మీడియాకు చెప్పారు. రాత్రి 9 గంటల సమయంలో బాలు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డాక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. నిపుణులైన వైద్యులతో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు 10 మంది ప్రత్యేక వైద్యులతో కూడిన బృందం ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ‘బాలు కోలుకోవాలి, క్షేమంగా తిరిగి రావాలి’ అంటూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు కోట్లాదిమంది అభిమానులు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. మీడియాలో బాలు ఆరోగ్యంపై నిరంతరాయంగా వార్తలు వస్తున్నాయి. గురువారం అర్థరాత్రి 12 గంటల తర్వాత మరో హెల్త్ బులిటెన్ ఇస్తామని ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం మరింత ఆదోళన చెందిస్తోంది.



Source link

Related Articles

Rajinikanth To Meet Birthday party Leaders Monday To Come to a decision On Political Plunge – ‘थलैवा’ रजनीकांत निवडणुकीच्या रिंगणात उतरणार? आज पक्षाची बैठक

चेन्नई :सुपरस्टार रजनीकांत (Rajinikanth) हे आपल्या राजकीय जीवनातील एक महत्त्वाची घोषणा आज करू शकतात. राजकारणापासून दूर राहण्याच्या निर्णयावर पुन्हा एकदा विचार करण्याचा आग्रह...

ನೈಜೀರಿಯಾ ನರಮೇಧ: ಸುಮಾರು 110ಕ್ಕೂ ಹೆಚ್ಚು ರೈತರ ಹತ್ಯೆ | Nigeria: At Least 110 Farmers Killed By way of Boko Haram

ಅಬುಜಾ, ನವೆಂಬರ್ 30: ಈಶಾನ್ಯ ನೈಜೀರಿಯಾದಲ್ಲಿ ಘೋರ ಹತ್ಯಾಕಾಂಡ ನಡೆದಿದ್ದು, ಬಹುತೇಕ ರೈತು ಸೇರಿದಂತೆ 110 ಮಂದಿಯನ್ನು ಹತ್ಯೆಮಾಡಲಾಗಿದೆ.'ಮೋಟಾರ್ ಸೈಕಲ್‌ಗಳಲ್ಲಿ ಶಸ್ತ್ರಸಜ್ಜಿತ ವ್ಯಕ್ತಿಗಳು ಹೊಲಗಳನ್ನು ಕೊಯ್ಲು ಮಾಡುತ್ತಿದ್ದ ನಾಗರಿಕ ಪುರುಷರು ಮತ್ತು...

Modi will hang a gathering via video conferencing on December four to speak about Corona’s present situation | મોદી four ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગથી મીટિંગ...

Gujarati NewsNationalModi Will Hold A Meeting By Video Conferencing On December 4 To Discuss Corona's Current ConditionAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,459FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Rajinikanth To Meet Birthday party Leaders Monday To Come to a decision On Political Plunge – ‘थलैवा’ रजनीकांत निवडणुकीच्या रिंगणात उतरणार? आज पक्षाची बैठक

चेन्नई :सुपरस्टार रजनीकांत (Rajinikanth) हे आपल्या राजकीय जीवनातील एक महत्त्वाची घोषणा आज करू शकतात. राजकारणापासून दूर राहण्याच्या निर्णयावर पुन्हा एकदा विचार करण्याचा आग्रह...

ನೈಜೀರಿಯಾ ನರಮೇಧ: ಸುಮಾರು 110ಕ್ಕೂ ಹೆಚ್ಚು ರೈತರ ಹತ್ಯೆ | Nigeria: At Least 110 Farmers Killed By way of Boko Haram

ಅಬುಜಾ, ನವೆಂಬರ್ 30: ಈಶಾನ್ಯ ನೈಜೀರಿಯಾದಲ್ಲಿ ಘೋರ ಹತ್ಯಾಕಾಂಡ ನಡೆದಿದ್ದು, ಬಹುತೇಕ ರೈತು ಸೇರಿದಂತೆ 110 ಮಂದಿಯನ್ನು ಹತ್ಯೆಮಾಡಲಾಗಿದೆ.'ಮೋಟಾರ್ ಸೈಕಲ್‌ಗಳಲ್ಲಿ ಶಸ್ತ್ರಸಜ್ಜಿತ ವ್ಯಕ್ತಿಗಳು ಹೊಲಗಳನ್ನು ಕೊಯ್ಲು ಮಾಡುತ್ತಿದ್ದ ನಾಗರಿಕ ಪುರುಷರು ಮತ್ತು...

Modi will hang a gathering via video conferencing on December four to speak about Corona’s present situation | મોદી four ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગથી મીટિંગ...

Gujarati NewsNationalModi Will Hold A Meeting By Video Conferencing On December 4 To Discuss Corona's Current ConditionAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા...

ഒന്നാം തീയതി മുതല്‍ കടല്‍ പ്രക്ഷുബ്ധമാകും; സംസ്ഥാനത്ത് കനത്ത മഴയ്‌ക്കും സാധ്യത | Kerala | Deshabhimani

തിരുവനന്തപുരം > ഡിസംബര്‍ 1 മുതല്‍ കടല്‍ പ്രക്ഷുബ്ധമാകുവാന്‍ സാധ്യതയുള്ളതിനാല്‍ കേരള തീരത്ത് നിന്ന് കടലില്‍ പോകുന്നത് നവംബര്‍ 30 അര്‍ദ്ധരാത്രിയോടെ പൂര്‍ണ്ണമായും...

डॉ. शीतल आमटे यांचं अखेरचं ट्विट; त्यांना नेमकं काय सांगायचं होतं?

चंद्रपूर :  ज्येष्ठ समाजसेवक आणि महारोग्यांना आसरा देणाऱे बाबा आमटे baba amte यांची नात आणि डॉ. विकास आमटे यांची कन्या,  डॉ. शीतल आमटे...