Sponser
Home Telugu Venkaiah Naidu: బాలు మా ఊరి వ్యక్తి.. చిన్ననాటి నుంచే ప్రత్యేక అనుబంధం: వెంకయ్య నాయుడు...

Venkaiah Naidu: బాలు మా ఊరి వ్యక్తి.. చిన్ననాటి నుంచే ప్రత్యేక అనుబంధం: వెంకయ్య నాయుడు – venkaiah naidu condolences on legendary singer sp balu demise

0
7
Sponser


తెలుగింటి పాటల రేడు, సంగీత సామ్రాజ్యంలో రారాజు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ‘పాటల బాలు’గా సుపరిచమైన ఆయన దశాబ్దాల పాటు తన గానంతో దేశ ప్రజలను అలరింపజేశారు. మంత్రముగ్ధుల్ని చేశారు. 50 రోజులుగా హాస్పిటల్‌లో పోరాడుతూ కరోనాను జయించిన ఆయన ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో.. శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. బాలు ఇక లేరనే వార్తతో దేశం చిన్నబోయింది.

బాలు కుటుంబసభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలు మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎస్పీ బాలు తన సొంత గ్రామానికి చెందిన వారైనందున చిన్న నాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.

‘ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్దాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

Sponser

‘గాన గంధర్వుడైన ఎస్పీ బాలు మా ఊరి వాడైనందున చిన్నప్పటి నుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం’ అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. ‘బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

Also Read:రైలు కింద పడినా బాలుడు బతికాడు.. ఇది ‘దేవుడి’ మాయే

Don’t Miss:‘రచయిత రాసేవి కావు.. ఎస్పీ బాలు పాడినవే.. వాటికి నేనే సాక్షి’Source link

Sponser

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here